Thiruvadi – Lotus feet – Telegu

అన్ని జీవజంతువులు పరమసుఖం తో  జీవించుగాక
దైవం ఒక్కడే
శరీరం లో పవిత్రుడైన పరమాత్మ ఒక ఆలయం వలె నివశించెను
–           తిరుమందిరం చెప్తారు

అంతటా వ్యాపించి ఉన్న, అత్యంత శక్తివంతమైన భగవంతుడు మన శిరస్సు మధ్యలో జ్ఞానేంద్రియాల కేంద్ర బిందువు వద్ద  ఆత్మజ్యోతి వలె నివసిస్తున్నాడు. అక్కడ నుండి అతను రెండు నాడుల ద్వారా రెండు నేత్రములవలే ప్రకాశిస్తూ ఉంటాడు . ఇది దైవ రహస్యం. ఇదే వేదాల యొక్క వివేకము. మన రెండు నేత్రములు భగవంతుని యొక్క రెండు దైవ పాదములు.

జ్ఞానానికి అర్హత గల గురువు ద్వారా మన జీవితపు కాంతిని అనుభవించాలి . ధ్యానం కండ్లు తెరిచి చేయవలెను. కండ్లలో దైవిక కాంతిపై దృష్టి ఉంచి, కన్నీళ్ళు  రాలుతాయి. ఒకరు దైవిక కాంతి మరియు దయ తమరిలోపల నుండి అనుభూతి పొందవచ్చు. మనం దైవానుగ్రహం గురించి ఆలోచిస్తూ  కృతజ్ఞతతో  కన్నీళ్లు పెట్టుకుంటాం. పూర్వ జన్మ నుండి వచ్చే కర్మ ఖాతా తుడిచివేయబడుతుంది మరియు మనలోని ఉన్న దేవుని ద్యోతకాన్ని చూడగలుగుతాం.  ఇది మన జీవితం యొక్క ఉద్దేశ్యం. ఇది జీవ కారుణ్యం యొక్క సారాంశం. సన్మార్గం. మీ ఆత్మ వైపు సానుభూతి చూడుము. ఇది శుభకర మార్గం. ఇది దేవుని ఆరాధన, తిరువరుత్ ప్రకాశ వళ్ళలార్  చెప్పినారు.

ధ్యానం, తపస్సు అనగా మన కండ్లను మూసుకొనుట కాదు. దాని అర్థం ఏమనగా మన కళ్ళలో జీవం యొక్క మెరుపును జ్ఞానానికి అర్హత గల గురువు ద్వారా గ్రహించాలి. ఆపై మన కళ్ళతో తేజస్సు యొక్క ప్రకాశాన్ని మెరుగుపరచాలి(మన కళ్ళతో ఆత్మజ్యోతి  యొక్క ప్రకాశాన్ని మెరుగుపరచాలి). ఆ మెరుగు పరచడం నిజమైన ధ్యానం మరియు తపస్సు. బయట దేవుడిని వెతకడాన్ని భక్తి అంటారు. బాహ్య ఆరాధన -అది ప్రారంభ పద్ధతి.  శరీరం లోపల ఉన్న దేవుణ్ణి వెతకడం -ఇది వివేకం – అంతర్గత  ఆరాధన ముక్తి .

జ్ఞానులు, ఋషులు, సిద్ధజ్ఞానులు అందరూ మన దృష్టితో భగవంతుని సాక్షాత్కారానికి మార్గం మన కండ్ల ద్వారా చూపారు. నిన్నటి వరకు ఏమి అయినదో దాన్ని పట్టించుకోనక్కరలేదు. ఈ రోజు నుండి ఏ విధమైన చెడు అలవాట్ల జోలికి పోరాదు . ఏ జీవరాసులను  హతమార్చరాదు. మాంసాహార భోజనాన్ని భుజించరాదు.

భక్తి  కలిగి ఉండండి, వినయం కలిగి ఉండండి. తగిన గురువు ద్వారా తిరువడి ఉపదేశ దీక్షను స్వీకరించి, తపస్సు చేసి భగవంతుడిని పొందవచ్చు. ఇది ప్రతి. ఒక్కరికి సందేశం.

ఎల్లప్పుడూ మీ నిజమైన,

జ్ఞాన సత్ గురు శివ సెల్వరాజ్

కన్యాకుమారి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top